ముర్కుంజాల్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

*ముర్కుంజాల్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు* *సాంప్రదాయ ఆటపాటలతో సందడిగా పండుగ వేడుకలు*. నారాయణఖేడ్, అక్టోబర్ 16 (ప్రజావాణి): కంగ్టి మండల పరిధిలోని ముర్కుంజాల్ గ్రామంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. బతుకమ్మ...