prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 8:08 pm Digital Edition : PRAJA VANI

ముర్కుంజాల్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

*ముర్కుంజాల్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు*

*సాంప్రదాయ ఆటపాటలతో సందడిగా పండుగ వేడుకలు*.

నారాయణఖేడ్, అక్టోబర్ 16 (ప్రజావాణి):

కంగ్టి మండల పరిధిలోని ముర్కుంజాల్ గ్రామంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. బతుకమ్మ పాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. మహిళలందరూ ఐకమత్యంతో వేడుకల్లో పాల్గొనడంతో ముర్కుంజాల్ గ్రామంలో పండుగ శోభ సంతరించుకుంది.