prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 5:37 pm Digital Edition : MAHESH MEDCHAL

మున్సిపల్ సిబ్బందికి నూతన దుస్తులు అందజేసిన వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్

*మున్సిపల్ సిబ్బందికి నూతన దుస్తులు అందజేసిన వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్*

*సిబ్బందితో కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్*

మేడ్చల్ ప్రజావాణి :- దసరా పండుగను పురస్కరించుకుని మేడ్చల్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్ నూతన దుస్తులను అందజేశారు. పండుగ వేళ సిబ్బందితో ఆత్మీయంగా మమేకమై, వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన దుస్తులు అందజేయడం పట్ల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, వీధుల పరిశుభ్రతతో పాటు ప్రజలకు వివిధ సేవలు అందించడంలో మున్సిపల్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. ఎండ, వానలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న సిబ్బంది కృషిని గుర్తించాలని అన్నారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. మున్సిపల్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా పండుగను జరుపుకోవాలని కోరుకున్నారు. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ప్రార్థించారు. సిబ్బంది సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రవి, బిక్షపతి, సత్తయ్య, పద్మారావు, ప్రభాకర్, శంకరయ్య, మల్లేశా, సంజీవ, రాము, బాలకృష్ణతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నూతన దుస్తులు అందజేసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ గౌడ్‌కు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.