prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 8:30 am Digital Edition : PRAJA VANI

మున్సిపల్.కార్యాలయాన్నిసందర్శించినఆర్‌డీఓజల కుమారిఘనంగా స్వాగతించిన చైర్మన్ ప్రశాంత్ కుమార్

మున్సిపల్.కార్యాలయాన్నిసందర్శించినఆర్‌డీఓజల కుమారిఘనంగా స్వాగతించిన చైర్మన్ ప్రశాంత్ కుమార్

జమ్మికుంటఅక్టోబర్ 07 (ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాన్ని హుజూరాబాద్ డివిజన్ రెవెన్యూ అధికారి (ఆర్‌డీఓ) జల కుమారి బుధవారం సందర్శించారు తొలిసారిగా కార్యాలయానికి విచ్చేసిన ఆర్‌డీఓ కి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి పూలగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారుఅనంతరం ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు ప్రజా సమస్యలు రెవెన్యూ మున్సిపల్ శాఖల సమన్వయంతో చేపడుతున్న పరిపాలనా అంశాలపై ఆర్‌డీఓ తో చైర్మన్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్‌డీఓ సూచించారుఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఓ సుధాకర్ కౌన్సిలర్లు ఆర్‌ఐతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు