prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 4:34 pm Digital Edition : PRAJA VANI

ముదిరాజ్ సింహ గర్జనను విజయవంతం చేయండి

*ముదిరాజ్ సింహ గర్జనను విజయవంతం చేయండి*

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా:-*

జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని పద్మావతి గార్డెన్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న జరగబోయే ముదిరాజ్ సింహ గర్జనను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర సీనియర్ కార్యదర్శి తండబోయిన శ్రీకాంత్ లు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ సింహగర్జనకు కుల బంధువులందరూ ఏకమై రావాలన్నారు. సింహ గర్జన మహాసభకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఈటల రాజేందర్, బీసీ నేత నీలం మధు, పలువురు ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ సభలో ముదిరాజుల డిమాండ్ అయిన బీసీ-డీ నుంచి బీసీ-ఏకి మార్పుతో పాటు ముదిరాజుల హక్కులు, పలు సమస్యలపై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. ఈసమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాదబోయిన కృష్ణ, ఉపాధ్యక్షుడు మేకల తిరుపతి, జిల్లా యువత అధ్యక్షుడు గరిగే సుమన్ లు పాల్గొన్నారు..