prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 9:05 pm Digital Edition : PRAJA VANI

ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నెల్లి రాజలింగు, కట్ల శ్రీనివాస్

*ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నెల్లి రాజలింగు, కట్ల శ్రీనివాస్*

* *మన ప్రజావాణి* *మందమర్రి*:-

తెలంగాణ ముదిరాజ్ మహాసభ పట్టణ అధ్యక్షుడిగా నెల్లి రాజలింగు, ప్రధాన కార్యదర్శిగా కట్ల శ్రీనివాస్ లు నియమితులయ్యారు. శుక్రవారం పట్టణానికి విచ్చేసిన సంఘం జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, యువత అధ్యక్షుడు గరిగే సుమన్ లు రాజలింగు, శ్రీనివాస్ లను పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. అనంతరం కొమరయ్య సుమన్ లు మాట్లాడుతూ, సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పాత కమిటీలను రద్దు చేసి, నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పట్టణ పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, కుల సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..