prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 9:33 pm Digital Edition : PRAJA VANI

ముదిరాజ్ సంఘం అధ్యక్షునిగా శంకర్

ముదిరాజ్ సంఘం అధ్యక్షునిగా శంకర్
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలకేంద్రం లోని నడివాడ ముదిరాజ్ సంఘం కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా గుండ్రపల్లి శంకర్, ఉపాధ్యక్షుడిగా పెండ్యాల యాకయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.దీంతో వీరికి ముదిరాజ్ కులస్తులు బొట్టు పెట్టి శుభాభినందన, శుభాకాంక్షలు తెలిపారు. ముదిరాజుల ఐక్యతకు, సంఘంతోపాటు సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

*ఐక్యత అభివృద్ధికి పాటుపడతాం..*

ముదిరాజు కులస్తుల తో పాటు సంఘం ఐక్యతకు అభివృద్ధికి అందరితో కలిసి పాటుపడతామని నూతనంగా ఎన్నికైన నడివాడ ముదిరాజ్ సంఘం అధ్యక్ష,ఉపాధ్యక్షులు గుండ్రపల్లి శంకర్,పెండ్యాల యాకయ్యలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముదిరాజ్ సామాజిక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.