ముత్యాలమ్మ యూత్ ఆధ్వర్యంలో రావణ వధ
ప్రజావాణి,ఇనుగుర్తి:విజయదశమి పురస్కరించుకొని మండలం చిన్ననాగారంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో చారిత్రక ముత్యాలమ్మ ఆవరణంలో మంగళవారం రావణ వధ నిర్వహించారు. అధర్మంపై ధర్మం,చెడుపై మంచి విజయం సాధించడానికి గుర్తుగా రావణ వద నిర్వహించినట్లు ముత్యాలమ్మ యూత్ ప్రతినిధులు తెలిపారు. కాగా గ్రామంలో గత సంవత్సరం నుంచి ముత్యాలమ్మ యూత్ ఆధ్వర్యంలో రావణ వద కార్యక్రమం నిర్వహించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడానికి సంబంధిత కార్యక్రమాలు ఉపయోగపడతాయని పలువురు అభినందిస్తున్నారు.కార్యక్రమంలో నాయకులు బైరు శ్రీనివాస్ గౌడ్,బైరు రమేష్ గౌడ్,మాదాటి రామమూర్తి గౌడ్, మరద హరికృష్ణ గౌడ్,ముత్యాల సంపత్,మురళి తదితరులు పాల్గొన్నారు.