prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 9:05 pm Digital Edition : PRAJA VANI

మీ భూమి -మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు

మీ భూమి -మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో (అక్టోబర్) 9

కొండపి నియోజకవర్గం,
జరుగుమల్లి మండలం, నరసింగోలు గ్రామంలో ముఖ్యమంత్రి గౌ. శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు నిర్వహించిన మీ భూమి – మీ హక్కు లో “రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ” అనంతరం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పార్టీ నాయకులతో కార్యకర్తలకు ఏర్పాటు చేసిన పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి గారు, మారిటైం బోర్డ్ చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు, ఒంగోలు పార్లమెంటరీ అబ్జర్వర్ శ్రీ మద్దిపాటి వెంకట రాజు గారు, ఒంగోలు పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ శ్రీ కొటారి నాగేశ్వరరావు గారు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూటమి ప్రభుత్వం భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి సంబంధించి కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి గడపగడపకి వెళ్లి వివరించాలని తెలియజేయడమైనది. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఒక్క కూటమి నాయకులు. కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా ముందుకు కొనసాగాలని తెలియపరిచారు. అదేవిధంగా పార్టీలో ఎటువంటి విభేదాలు లేకుండా ఐక్యభావంతో ప్రతి ఒక్కరూ ముందుకు కొనసాగాలని తెలియజేయడమైనది. ముందుగా చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ రద్దును మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రద్దు చేయడమైనది. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి నాయకులను ఇబ్బంది పెట్టడం జరిగింది అయినా కూడా రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకోవడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐక్యభావంతో ప్రతి ఒక్క కూటమి నాయకులు మరియు కార్యకర్తలు ముందుకు కొనసాగాలని తెలియజేయడమైనది.