prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 10:04 pm Digital Edition : PRAJA VANI

మియాపూర్ లో సుప్రజా హాస్పిటల్స్‌ ప్రారంభం

**మియాపూర్ లో సుప్రజా హాస్పిటల్స్‌ ప్రారంభం **

శేరిలింగంపల్లి,అక్టోబర్ 15, ప్రజావాణి : హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ధంతూరి గ్రూప్‌కు చెందిన సుప్రజా హాస్పిటల్స్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై నిర్వాహకులతో కలిసి ఆసుపత్రిని ఘనంగా ప్రారంభించారు.అనంతరం అతిధులను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలతో పాటు అత్యవసర సమయాల్లో సకాలంలో చికిత్స అందించడం ద్వారా ఆసుపత్రులు ప్రజలకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు. సుప్రజా హాస్పిటల్స్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.