prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 8:31 pm Digital Edition : PRAJA VANI

మా మద్దతు రమేష్ గౌడ్ కే

మా మద్దతు రమేష్ గౌడ్ కే –

అనంతపురం అభివృద్ధి వైసిపి మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌ తోనే సాధ్యం

మీడియాతో ఐక్య విద్యార్థి సంఘాల నేతలు

అనంతపురం బ్యూరో అక్టోబర్ 17 ప్రజా వాణి
అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ రమేష్ గౌడ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ శనివారం నగరంలోని ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మీడియా పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థి, యువజన సంఘాల ఏఐఎస్‌బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వి, పీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఆలం, పీఎస్‌యూ అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐఎస్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహ, ఏఐఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భీమేష్, ఏఐఎస్‌బీ జిల్లా కార్యదర్శి పోతులయ్య, పీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రతిభ భారతిలు మాట్లాడుతూ.. రమేష్ గౌడ్‌కి తమ పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు బహిరంగంగా వెల్లడించారు. గత 20 సంవత్సరాల నుంచి నగరంలో విద్యార్థుల సమస్యలపై, విద్యా రంగ అభివృద్ధిపై ఎల్లప్పుడూ స్పందించే గుణం రమేష్ గౌడ్‌ కి సొంతమని కొనియాడారు. విద్యార్థులు, యువత సమస్యలను పరిష్కరించడంలో ఆయన ముందుంటారని, నగరంలో విద్యా వసతుల మెరుగుదలకు, యువతకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఆయన వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. నగరంలో ఉన్న మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ వ్యవస్థల పునర్నిర్మాణం, సురక్షిత తాగునీరు, నగర సౌందర్యీకరణ వంటి అంశాలలో రమేష్ గౌడ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఒక సమర్థుడైన, నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు మేయర్ పీఠాన్ని అధిరోహిస్తేనే అనంతపురం నగరం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. బీసీ రమేష్ గౌడ్‌ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అనంతపురం నగర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థి లోకం, నిరుద్యోగ యువత అంతా ఐకమత్యంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కి మీ మద్దతు తెలపాలి అని విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు సాహిత్, వినోద్, దామో తదితరులు పాల్గొన్నారు.