మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి కుటుంబాన్ని పరామర్శించిన మద్దుల గోపాల్ రెడ్డి

ఉమ్మడి వెల్గటూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్ల తిరుపతి తండ్రి భూమయ్య నాలుగు రోజుల క్రితం పరమపదించడంతో, వారి కుటుంబాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి పరామర్శించారు. శోకసప్త కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భూమయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ పరామర్శలో కాంగ్రెస్ ఎండపల్లి మండల ప్రధాన కార్యదర్శి కందికట్ల రాజేశం, ఫ్యాక్స్ ఛైర్మన్ గూడ రాంరెడ్డి, స్థానికురాలు మంజులతో పాటు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.