prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 8:47 pm Digital Edition : PRAJA VANI

మార్కాపురం జిల్లా తొలి ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన మార్కాపురం జిల్లా ప్రజాప్రతినిధులు

మార్కాపురం జిల్లా తొలి ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన మార్కాపురం జిల్లా ప్రజాప్రతినిధులు

ప్రజావాణి ప్రతినిధి మార్కాపురం జిల్లా అక్టోబర్ 11

మార్కాపురం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు తొలి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పంకజ్ కుమార్ మీనా IPS గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు.

నూతన మార్కాపురం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించే దిశగా ఎస్పీ గారి సేవలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.