మామిళ్ల సత్తమ్మ దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన వేముల మహేష్ గౌడ్
ఘట్కేసర్, అక్టోబర్ 25 (ప్రజావాణి): మామిళ్ల ముత్యాల యాదవ్ తల్లి మామిళ్ల సత్తమ్మ దశదినకర్మ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని సత్తమ్మకు నివాళులర్పించారు. మామిళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, కడపొల్ల మల్లేష్, మర్రం లక్ష్మారెడ్డి, అబ్బసాని యాదగిరి, బేతాళ...