మాన్యవర్ కాన్షిరాం పోరాటమే స్ఫూర్తి
ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో
ఒంగోలు , అక్టోబర్ 9 :
బహుజనుల రాజ్యాధికారం కోసం కాన్షిరామ్ పోరాటం పూర్తిగా తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంజి గోపిరాజు పేర్కొన్నారు . కాన్షిరం గారి వర్ధంతి సందర్బంగా ఒంగోలు భాగ్యనగర్ లోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో కాన్షీరామ్ వర్ధంతి సభ నిర్వహించారు. సభలో తొలుత కాన్షిరాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రకాశం జిల్లా అధ్యక్షులు గంజి గోపిరాజు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయం మేరకు బహుజనులు కు రాజ్యాధికారం కొరకు బహుజన సమాజ్ పార్టీ ని స్థాపించి అనతి కాలం లోనే ఉత్తరప్రదేశ్ లో అధికారం తీసుకురావడం తో భారత దేశం లో అణగారిన వర్గాలలో ఆత్మ స్థైర్యాన్ని నింపిన మహానుభావులు కాన్షిరాం అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీ లు బిసి లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి 50%సీట్ల లో వారికీ రిజెర్వేషన్ కల్పించాలని ఆయన అన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి లకు బహుజన సమాజ్ పార్టీ అధిక సంఖ్య లో సీట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ప్రకాశం జిల్లా లో పోటీ చేయడలచుకున్నవారు, అంబేద్కర్ ఆలోచన పరులు 8309909678 అనే నంబర్లో కానీ, బిఎస్పి కార్యాలయంలో కానీ సంప్రదించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ ఇంచార్జ్, న్యాయవాది డాక్టర్ నూకతోటి రవికుమార్ , ఆఫీస్ ఇంచార్జ్ యర్రయ్య ,కొమ్ము శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.