prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 5:09 pm Digital Edition : PRAJA VANI

మానవత్వం చాటుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

*మానవత్వం చాటుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య…*

*ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.50 వేల ఆర్థిక సాయం అందజేత.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05*

నాగార్జునసాగర్ గురుకుల పాఠశాలలోని మూడో అంతస్తు నుంచి మిర్యాల గూడ పట్టణానికి చెందిన గురుకుల విద్యార్థి ఆవుల నరేందర్ ప్రమాదవశాత్తు కిందపడిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఎల్‌. బీ నగర్‌లోని వెల్‌నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య ఆసుపత్రికి వెళ్లి నరేందర్‌ను పరా మర్శించారు. నరేందర్ ఆరోగ్య పరిస్థితిని పరి శీలించి , వైద్యులను అడిగి చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన బీర్ల ఐలయ్య , నరేందర్ పూర్తిగా కోలు కునే వరకు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని నరేందర్ కుటుంబ సభ్యులకు అంద జేశారు. నరేందర్‌కు మెరు గైన వైద్యం అందేలా అవ సరమైన సహాయ సహ కారాలు కొనసాగిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు.