*మానవత్వం చాటుకున్న గోలి శ్రీనివాస్ రెడ్డి గారు.. బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత…*
*నాగర్ కర్నూలు జిల్లా…*
*ప్రజావాణి ప్రతినిధి: అక్టోబర్ 09*
వెల్దండ మండలం:మండలంలోని పోతేపల్లి గ్రామానికి చెందిన డెంకి చంద్రమౌళి, లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లెపాకుల ప్రశాంత్ అనారోగ్యంతో మృతి చెందరు. స్థానిక నాయకులు అంజి మాస్టర్ ద్వారా విషయం తెలుసుకున్న ఆయన,బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున మొత్తం రూ.10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చలమల శారద బాలయ్య గౌడ్, వార్డు సభ్యుడు గోరేటి అశోక్ కుమార్, చిన్న సైదయ్య, డీలర్ వెంకటయ్య, శ్రీనివాసులు, పెరపాకుల గోపాల్, సాయిబాబు, అర్జున్, కొమ్ము భరత్, ఎగిరిశెట్టి ఎల్లాజీ, దేవదాస్, మల్లెపాకుల శేఖర్, దానయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.