మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు

ఘట్‌కేసర్, అక్టోబర్ 21 (ప్రజావాణి): దసరా పండుగను పురస్కరించుకుని మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్‌ను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఘన్‌పూర్ మాజీ సర్పంచ్ వేముల సంజీవ్ గౌడ్, కొండాపూర్‌కు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి, పోచారం 8వ డివిజన్‌కు చెందిన సామల జయమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు తూళ్ల దేవేందర్ గౌడ్‌తో ఆత్మీయంగా...