ఘట్కేసర్, అక్టోబర్ 21 (ప్రజావాణి): దసరా పండుగను పురస్కరించుకుని మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్‌ను పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఘన్పూర్ మాజీ సర్పంచ్ వేముల సంజీవ్ గౌడ్, కొండాపూర్‌కు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి, పోచారం 8వ డివిజన్‌కు చెందిన సామల జయమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు తూళ్ల దేవేందర్ గౌడ్‌తో ఆత్మీయంగా మాట్లాడి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.