మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని కలిసిన పోచారం డివిజన్ నాయకులు
ఘట్కేసర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): దసరా పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని పోచారం డివిజన్‌కు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు దసరా పండుగ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్...