ఘట్‌కేసర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): దసరా పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని పోచారం డివిజన్‌కు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నాయకులు దసరా పండుగ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ నాయకులు సామల సందీప్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కందుల నవీన్, నీరుడి శ్రీనివాస్, బుర్ర వెంకటేష్, కట్ట కృష్ణ, జంగయ్య, ఎల్లయ్య, ప్రభాకర్, లింగం, శివరాజ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.