prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 11:58 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

మాజీ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ చేతుల మీదుగా నూతన వస్త్ర దుకాణం ప్రారంభం

ఘట్‌కేసర్ అక్టోబర్ 11:ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో మహిళల కోసం అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉండే నూతన వస్త్ర దుకాణాన్ని దార్ల ఎలిజబెత్ విజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ మాట్లాడుతూ, మహిళల అభిరుచులకు అనుగుణంగా సంప్రదాయ చీరలు, పండుగలు, శుభకార్యాలకు అనువైన వస్త్రాలు, ఆధునిక ఫ్యాషన్ దుస్తులు అందుబాటులో ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు.

మహిళలు తమకు నచ్చిన రంగులు, డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలను ఎంపిక చేసుకుంటూ తమ వ్యక్తిత్వానికి మరింత అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని జోడించుకోవచ్చని తెలిపారు. మహిళల వస్త్రాభిరుచులకు ప్రాధాన్యతనిస్తూ నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్, బొక్కా సంగీత ప్రభాకర్ రెడ్డి పాల్గొని దార్ల ఎలిజబెత్ విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన వస్త్ర దుకాణం విజయవంతంగా అభివృద్ధి చెందుతూ, మహిళలకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ మరెన్నో విజయాలు సాధించాలని కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ ఆకాంక్షించారు.