prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 3:12 pm Digital Edition : PRAJA VANI

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో బీజేపీలో చేరిన యువ నాయకుడు శంకర్ నాయక్ గారు

*మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో బీజేపీలో చేరిన యువ నాయకుడు శంకర్ నాయక్ గారు…*

నాగర్ కర్నూల్ జిల్లా…
ప్రజావాణి ప్రతినిధి:
అక్టోబర్ 29…

అచ్చంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ మాజీ గ్రామ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, మాజీ ఎమ్మెల్యే *డా. గువ్వల బాలరాజు గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.*

ఈ సందర్భంగా గువ్వల బాలరాజు గారు శంకర్ నాయక్ గారికి పార్టీ కండువా కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు.

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమం, యువతకు అవకాశాలు మరియు దేశ సమగ్ర ప్రగతి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషికి ఆకర్షితులై నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వరికుప్పల ఆంజనేయులు గారు, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జి అఖిల్ రెడ్డి గారు, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవీందర్ చౌహన్ గారు, BJYM జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారు, బిజెపి నాయకులు పత్య నాయక్ గారు, పిట్టల కృష్ణయ్య గారు, దేవపూజ రమేష్ గారు పాల్గొన్నారు.