మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ
10 లక్షల తో భవన నిర్మాణం,
స్థలదాతకు
బూర్గంపాడు ఎంపీడీవో జమలారెడ్డి అభినందనలు
బూర్గంపాడు మండలం మన (ప్రజావాణి) న్యూస్ అక్టోబర్ 28 ,
బూర్గంపాడు మండలం లోని బుడ్డగూడెం గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి ఎంపీడీవో జమలారెడ్డి భూమి పూజ చేశారు. వి -బి జి -రాంజీ -నిధుల ద్వారా10 పది లక్షల రూపాయలు అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే మహిళలకు సమావేశాలు నిర్వహించుకోవడానికి. పొదుపు రుణాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని ఎంపీడీవో జమల రెడ్డి తెలిపారు. భవన నిర్మాణానికి స్థల కేటాయించిన స్థలదాత షోడే కుషిదా తోలయ్యను అభినందించారు. అనంతరం గ్రామంలో సోడే ఉమాదేవి ఫారం ఫండ్ పథకం అమలు తీరును పరిశీలించారు. చేపడుతున్న అభివృద్ధి పథకం పనుల పురోగతి పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాటి లక్ష్మీ, గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సోంపల్లి గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు