*మహిళా శక్తి భవన నిర్మాణానికి శంకు స్థాపన…*
*సీసీ కెమెరాలను ప్రారంభించిన చేసిన ఎమ్మెల్యే కుంభం.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02*
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో శుక్రవారం రోజున నిర్వ హించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భువనగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం జిల్లా కాంగ్రెస్ నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ ఆర్థిక సహాయంతో గ్రామం లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామం లో శాంతి భద్రతల పరి రక్షణతో పాటు ప్రజల భద్రతను మరింత బలో పేతం చేయడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలోని ప్రధాన ప్రాంతాలు , రహదారుల పై జరిగే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటా యని , గ్రామంలో భద్రతకు సంబంధించిన చర్యలకు సహకరించాలని సూచించారు.
ఈ కార్య క్రమంలో స్థానిక సర్పంచ్ నాగెల్లి గిరిజ-రమేష్ , పిఎసిఎస్ చైర్మన్ పక్కిర్ కొండల్ రెడ్డి , ఆత్మ కమిటీ చైర్మన్ ఎలిమినేటి కృష్ణా రెడ్డి , ఉపసర్పంచ్ ములుగు లక్ష్మయ్య , మాజీ ఎంపీటీసీ మట్ట పారిజాత శంకర్ బాబు గౌడ్ , గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రమౌళి , ఉపసర్పంచ్ ములుగు లక్ష్మయ్య , గ్రామ పాలక వర్గం , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మట్ట అంజయ్య గౌడ్ , అధికారులు , కార్య కర్తలు , గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.