prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 4:58 pm Digital Edition : PRAJA VANI

మహాత్మునికి సిపిఐ వినతి

మహాత్మునికి సిపిఐ వినతి

మోదీ కి ప్రజాస్వామ్య స్ఫూర్తి ని కలిగించాలి,
పౌరుల ఓటు హక్కు భంగం కలిగిస్తున్న
ఈ సి జ్ఞానేశ్ తప్పుకోవాలి,
నియంత మోదీ మనసు మార్చాలి
నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 13 ప్రజావాణి:
ప్రజాస్వామ్యానికి పట్టు గొమ్మలాంటి పౌరుల ఓటు హక్కును నిర్ధాక్షణంగా తొలగించడం రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి ఆరోపించారు
కురవి మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి, నియంత ప్రధాని మోది మనసు మార్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలిగించాలని సిపీఐ నాయకులు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈసీ ని అడ్డుపెట్టుకొని దేశంలో లక్షలాది ఓట్లను ఏకపక్షంగా తొలగించి ఆయా రాష్ట్రాలలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా తమ అధికారాన్ని సుస్థిరపరచుకోవాలని దురుద్దేశంతో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తూ, ప్రజా ఆందోళనలను మిలటరీ పోలీసు బలగాలతో అణిచివేయాలని ప్రయత్నించడం తమ అవివేకానికి నిదర్శనమని, చరిత్రలో ఎమర్జెన్సీ విధించిన వాల్లు కాలగర్భంలో కలిసారని,అప్రకటిత ఎమర్జెన్సీని విధించి,నీ పతనాన్ని నీవే తెచ్చుకున్నావ్ అనేది గుర్తుంచుకోవాలని అన్నారు
ఇప్పటికైనా ఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే తొలగించి, సర్ ప్రక్రియను నిలిపివేసి, ఈసీ ఎన్నిక మార్గదర్షాలను మార్చి రాజ్యాంగ విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ కొరవి టౌన్ కార్యదర్శి తురక రమేష్, కన్నే వెంకన్న దూది కట్ల సారయ్య బొల్లం ఉప్పలయ్య, కలగూర నాగరాజు, ని లుగొండ నాగేశ్వరరావు బొడ్డు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు