prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 5:15 pm Digital Edition : PRAJA VANI

మహమ్మదాబాద్ గ్రామ ప్రజలందరికీ బతకమ్మ పండుగ శుభాకాంక్షలు

మహమ్మదాబాద్ గ్రామ ప్రజలందరికీ బతకమ్మ పండుగ శుభాకాంక్షలు..

గ్రామ సర్పంచ్ శకుంతల బాలు సార్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ…

బతుకమ్మ దేవీ నవ రాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి.

ప్రజలందరికీ బతుకమ్మ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.

ఎల్లవేళల ప్రజలతోని నిరంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ శకుంతల బాలు సార్

మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 11

మన సంస్కృతి , సంప్ర దాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్బంగా జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ ప్రజలకు ఆడపడుచులందరికీ బతుకమ్మ , దేవీ నవ రాత్రులు , దసరా పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం పితృ అమావాస్యతో ప్రారంభ మయ్యే బతుకమ్మ ఉత్స వాలతో పాటు ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దేవి శరన్నవరాత్రోత్స వాలు ఐక్యతతో , ప్రశాంత వాతావరణంలో జరుపు కోవాలని సూచించారు. ఎక్కడా లేని విదంగా ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్త రించిందని తెలిపారు. పోరాడి సాధించిన తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎంగిలి పువ్వు ప్రారంభమయ్యే బతుకమ్మ , దేవీ నవరాత్రుల పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గ్రామ సమస్యను పరిష్కరిస్తానని ప్రజలు నా మీద నమ్మకంతో గెలిపించారు. వారికి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సర్పంచ్ శకుంతల బాలుసార్ మాట్లాడారు.. ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఆయన బతుకమ్మ , దేవీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.