మల్లమ్మ కాలనీ–సాయినగర్ కాలనీకి సీసీ రోడ్డు.. పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

  ఘట్‌కేసర్, అక్టోబర్ 10 (ప్రజావాణి):ఘట్‌కేసర్ మండలం పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడ గ్రామంలో మల్లమ్మ కాలనీ నుంచి సాయినగర్ కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పోచారం డివిజన్ కాంగ్రెస్ నాయకుడు కర్రి రాజేష్ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్, చౌదరిగూడ మాజీ ఎంపీటీసీ పులికంటి భాస్కర్ రెడ్డి ఈ పనులను ప్రారంభించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే కాలనీవాసులకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రజల...