prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 6:54 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

మర్రిపల్లిగూడెంలో శ్రీ శ్రీ శ్రీ దుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఊరేగింపు

ఘట్కేసర్, అక్టోబర్ 19 (ప్రజావాణి):

మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని మర్రిపల్లిగూడెంలో శ్రీ శ్రీ శ్రీ దుర్గమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మర్రిపల్లిగూడెంలోని వివిధ ప్రాంతాల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాలధారణ చేసిన భక్తులు ఎడిగళ్ల ప్రవీణ్, రాపోలు సురేష్, అరిగె కొండల్, నీలం దామోదర్, బేత్కూరి చందు, చిలుగూరి అంజి, చిలుగూరి రాజు, మేకల జగదీష్, సీహెచ్. ప్రేమ్, సీహెచ్. సాయి, బి. మధు, పవన్, సీహెచ్. భాను, హరి, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.