మర్మాముల గ్రామపంచాయతీ సాధారణ సమావేశం
ఆకర్షనీయ బతుకమ్మల తయారీదారులకు నగదు బహుమతులు
గ్రామ సర్పంచ్,పాలక వర్గం సభ్యులు
మద్దూరు అక్టోబర్9, ప్రజా వాణి,
మండలంలోని మర్మాముల గ్రామపంచాయతీలో సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. చర్చించిన అంశాలు బతుకమ్మ ,దసరా పండుగ సందర్భంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి, అలాగే బతుకమ్మ పండుగ రోజు గ్రామంలో ఆకర్షణీయమైన బతుకమ్మలను తయారు చేసిన వారికి మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా 5000,3000,2000 రూపాయలను గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం సభ్యుల ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు.అలాగే గ్రామపంచాయతీ వాటర్ మెన్ గా పనిచేసిన ఘాజీకి వీడ్కోలు ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం సన్మానం చేసి వారికి చివరి వేతనం అందజేశారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి అశోక్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.