మర్పల్లిగూడెం దుర్గామాత సన్నిధిలో భక్తిశ్రద్ధలతోఅన్నదానం*
ఘట్కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని మర్పల్లిగూడెం గ్రామంలో శ్రీ దుర్గామాత అమ్మవారి సన్నిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారిని ప్రత్యేకంగా పూజించి, భక్తులు దర్శనం చేసుకున్నారు. దుర్గామాత అనుగ్రహంతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలుగా చిలుకూరి మంకయ్య, ఈదిగళ్ల బాలకృష్ణ, రాపోలు నరేష్, చిలుగురి హరికృష్ణ వ్యవహరించారు. అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు ఆనందం...