prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 4:34 pm Digital Edition : PRAJA VANI

మరణించిన కుటుంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం

మరణించిన కుటుంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం
కూసుమంచి, కూసుమంచి ( ప్రజావాణి )అక్టోబర్ 2: ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను ఆదుకునేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలోని పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. పోచారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కుటుంబాలకు అండగా నిలిచేందుకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, జిల్లా నాయకులు రామసాయం బాలకృష్ణారెడ్డి, రామ సహాయం వెంకటరెడ్డి, చాట్ల పరశురాం, పోచారం గ్రామ శాఖ అధ్యక్షుడు ఇందుర్తి వెంకటరెడ్డి, సర్పంచ్ సలవాది గురుమూర్తి, మాజీ సర్పంచ్ పోలంపల్లి అప్పారావు, మాజీ ఎంపీటీసీ పుట్ట అంజయ్య, మాలే రామ్‌రెడ్డి, వార్డు సభ్యులు పోలంపల్లి కమలహాసన్, కంభం పిచ్చయ్య, దరిపెల్లి రవి, నారాయణ, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు హాజరై పీఎస్ఆర్ ట్రస్ట్ సేవలను అభినందించారు.