*మధిరలో ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు*
*కె.వి.ఆర్ హాస్పిటల్ ఆవరణలో ఘనంగా కేక్ కటింగ్, తలసేమియా బాధితుల కొరకు భారీ రక్తదాన శిబిరం*
*నిర్వహించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కోట రాంబాబు*
*తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
*జన్మదినాన్ని పురస్కరించుకుని మధిర పట్టణంలోని కె.వి.ఆర్ హాస్పిటల్ ఆవరణలో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి*.
*మన ప్రజావాణి మధిర ఆర్ సి అక్టోబర్ 28*
మధిర కె.వి.ఆర్ హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోట రాంబాబు* ఘనంగా నిర్వహించారు. అనంతరం కె.వి.ఆర్ హాస్పిటల్ ఆవరణలో కేక్ కట్ చేసి, నాయకులంతా ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ *”శ్రీనన్న నాయకత్వం వర్ధిల్లాలి”* అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కోట రాంబాబు మాట్లాడుతూ.. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ, ప్రజల్లోంచి వచ్చిన నిజమైన ప్రజా నాయకుడిగా, పేదల పెన్నిధిగా నిలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులా నిలిచే సీనన్న మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

అనంతరం కె.వి.ఆర్ హాస్పిటల్ నందు తలసేమియా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని డాక్టర్ కోట రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట రాంబాబు మరియు అయిలూరి వెంకటేశ్వర్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి యువతలో గొప్ప ఉత్సాహాన్ని నింపారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన యువకులను, కాంగ్రెస్ శ్రేణులను నేతలు స్వయంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ & డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వర్ రెడ్డి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి మధిర టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవిశెట్టి రంగారావు ఎర్రుపాలెం మాజీ జెడ్పీటీసీ అంకశాల శ్రీనివాసరావు మధిర మాజీ ఎంపీపీ ఎర్రగుంట రమేష్, మధిర మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ శీలం వీరవెంకటరెడ్డి, అమరవాది సత్యనారాయణరెడ్డి తక్కెళ్ళపాడు గ్రామ సర్పంచ్ ముక్కర రామకృష్ణారెడ్డి లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ తళ్ళపురెడ్డి నాగిరెడ్డి , నిదానపురం సర్పంచ్ వేంపటి రమేష్ , ఎర్రుపాలెం మాజీ సర్పంచ్ మొగిలి అప్పారావు యాదవ్ రేమిడిచర్ల మాజీ సర్పంచ్ పురుషోత్తమ రాజు మీనవోలు ఉప సర్పంచ్ ముక్కర సందీప్ రెడ్డి, తక్కెళ్ళపాడు మాజీ ఉప సర్పంచ్ కూరపాటి రమేష్ మీనవోలు సొసైటీ అధ్యక్షులు కుడుముల మధుసూదన్ రెడ్డి జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి తలుపులు విజయ్ బాబు , కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కినపల్లి నాగేశ్వరరావు సత్యనారాయణ రాజు బాలకృష్ణ చిలక రాజేంద్ర , యశోధ విజయరాణి , మల్లెల లక్ష్మణరావు బుర్రా నారాయణ మారపోగు జమలయ్య , వెంకటేశ్వర్ రెడ్డి , జాన్ రెడ్డి , నారాయణ రెడ్డి , ప్రభాకర్ రావు వెంకటేశ్వరరావు యూత్ కాంగ్రెస్ శ్రేణులు కూరపాటి వరుణ్ , శీలం ప్రసన్నకుమార్ , గద్దల విజయ్ , గుండ్ల రత్న బాబు , శ్రీనివాస్ రెడ్డి , మహిళలు మరియు సీనన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.