మద్యానికి బానిసై యువకుడు మృతి

మద్యానికి బానిసై యువకుడు మృతి మద్దూరు అక్టోబర్ 15, ప్రజా వాణి, మండలంలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రాకేష్(35) అనే యువకుడు బ్రదుకు తెరువు కోసం కరీంనగర్ లో ఉంటూ మద్యానికి బానిసై మృతి చెందినట్లు గ్రామస్థులు విలేఖర్లకు తెలిపారు. మృతునికి భార్య ఉన్నట్లు తెలిపారు. మృతుని స్వగ్రామం గాగిల్లాపూర్ గ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.