prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 4:36 pm Digital Edition : PRAJA VANI

మద్నూర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులపై ఫిర్యాదు

మద్నూర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులపై ఫిర్యాదు..

నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ప్రజావాణిలో వినతి పత్రం అందజేత

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 12

మద్నూర్ మండలంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నాయని, నీటి వినియోగం లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల ప్రత్యేక అధికారి మద్నూర్ ప్రజావాణిలో TRS పార్టీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించి, నిబంధనల ప్రకారం పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫిర్యాదు చేసినవారు:
– బోర్గి సంజీవ్ — TRS పార్టీ నాయకులు
హన్మాండ్లు బండివార్ కలిసి ఎంపీడీవో కు వినతిపత్రాలు అందజేశారు..