prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 5:48 pm Digital Edition : PRAJA VANI

మద్దెల బాలరాజు దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన పలువురు ప్రముఖులు

*మద్దెల బాలరాజు దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన పలువురు ప్రముఖులు*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 24 (ప్రజావాణి): ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మద్దెల యాదగిరి క్రైమ్ కానిస్టేబుల్.తండ్రి మద్దెల బాలరాజు దశదినకర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మద్దెల బాలరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంచాల గ్రామ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు అశ్వాల బాలరాజు, రజక సంఘం రాష్ట్ర నాయకుడు మొగిలి మహేష్‌ లింగం తదితరులు పాల్గొన్నారు.

మద్దెల బాలరాజు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్నవారు బాలరాజు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.