మద్దూరు పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ
మద్దూరు అక్టోబర్21, ప్రజా వాణి,
మద్దూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో దసరా పండుగను పురస్కరించుకొని ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేసిన అనంతరం మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రజలు, సుఖ సంతోషాలతో కలిసి మెలిసి ప్రశాంత వాతావరణంలో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై తిరుమల బాబు, అర్చకులు పానుగంటి తిరుపతయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.