మద్దూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మద్దూరు అక్టోబర్28, ప్రజా వాణి,
మద్దూరు మండల కేంద్రానికి చెందిన ఐ కె పి క్రాంతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపిడిఓ శ్రీనివాస్, సర్పంచ్ దామెర మల్లేశం చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి బుదవారం ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేకిల్, ఏ పి ఏం ప్రకాశం, గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్, సి సి లు మహేందర్,కనకచంద్రం, మహిళ సంఘం సభ్యులు సలాది సరస్వతి, బోయినీ అంజవ్వ, తనుసం,డిల్లీ తాజ్,సత్తయ్య,రైతులు,హామలికార్మికులు తదితరులు పాల్గొన్నారు.