మత్స్యకార సంఘాలకు నూతన కమిటీల ఎన్నికకు సన్నద్ధం
*సూర్యాపేట జిల్లా పాలే అన్నారం మత్స్యశాఖ సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం* చిలుకూరు అక్టోబర్04(ప్రజావాణి):జిల్లా చిలుకూరు మండల పరిధిలోని పాలే అన్నారం మత్స్యశాఖ సహకార సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి మారయ్య సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, సంఘం కార్యకలాపాలపై చర్చించారు. మత్స్యకార సంఘాలకు నూతన కమిటీలను ఎన్నుకునేందుకు సభ్యులు సన్నద్ధం కావాలని మారయ్య సూచించారు. సంఘాల బలోపేతానికి సభ్యులందరూ ఐక్యంగా పనిచేయాలని, నూతన కమిటీల ను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో మత్స్యకార...