మఠంపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కోదాడ డీఎస్పీ.

మఠంపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కోదాడ డీఎస్పీ. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా. మహిళల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. హుజూర్నగర్ అక్టోబర్ 29 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా అనే...