మఠంపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కోదాడ డీఎస్పీ.

గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా.

మహిళల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు.

హుజూర్నగర్ అక్టోబర్ 29 (ప్రజావాణి)
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా అనే అంశాలను పరిశీలించడంతో పాటు, కేసులు పెరిగితే అందుకు గల కారణాలపై ఆరా తీసినట్లు డీఎస్పీ తెలిపారు.
మండలంలో గంజాయి, డ్రగ్స్, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికుల కదలికలపైనా నిఘా ఉంచుతున్నట్లు వెల్లడించారు.
మహిళలు తమ సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చేందుకు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గృహహింసకు గురవుతున్న మహిళల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ సిఐ చరమందరాజు, మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.