prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:32 pm Digital Edition : RUPAVATHRAMESH HUZURNAGARR

మట్టపల్లి చెక్ పోస్ట్ దగ్గర తృటిలో తప్పిన ముప్పు. రోడ్డుపై భారీ ట్యాంకర్ బోల్తా!

మట్టపల్లి చెక్ పోస్ట్ దగ్గర తృటిలో తప్పిన ముప్పు.

రోడ్డుపై భారీ ట్యాంకర్ బోల్తా!

హుజూర్నగర్ అక్టోబర్ 17 (ప్రజావాణి)

 

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలంలోని మట్టపల్లి దగ్గర ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గల బ్రిడ్జి వద్ద ఒక ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. మట్టపల్లి చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్ ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆ ప్రాంతంలో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. సమాచారం అందుకున్న మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అతి కష్టం మీద క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను పక్కకు తొలగించారు.