*మందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం*
*మన ప్రజావాణి*
మందమర్రి
మందమర్రి: దీపక్‌నగర్ ప్రాంతంలోని మాంటీసోరీ హైస్కూల్ లో ఆదివారం లయన్స్ క్లబ్ మందమర్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్లు సోతుకు సుదర్శన్ రావు, పోలు శ్రీనివాస్, అధ్యక్షులు పెండ్యాల గౌతం, సెక్రటరీ ఎండి జాకీర్, ట్రెజరర్ బుర్ర ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ రత్న జానకి, డైరెక్టర్ సుజాత, డైరెక్టర్ కొక్కుల మధు, లయన్ ఆర్ సి తిరుపతి రెడ్డి, మంచిర్యాల లయన్స్ క్లబ్ బాలాజీ,పర్యవేక్షణలో వైద్య బృందం సుమారు 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి లయన్ డైరెక్టర్ తుంగ పిండి రాజలింగు,ముఖ్య అతిథులుగా పాల్గొనగా. ఆయన కూడా ఉచిత కంటి పరీక్షలను
వినియోగించుకున్నారు.
వైద్యులు నిర్వహించిన కంటి పరీక్షల్లో 38 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. వీరికి మంగళ, బుధవారాల్లో పి, సత్యనారాయణ లయన్స్ కంటి ఆసుపత్రి బెల్లంపల్లి లో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆపరేషన్ల కోసం వెళ్లే వారిని వాహనంలో బెల్లంపల్లి ఆస్పత్రికి ఉచితంగా తీసుకెళ్లి, తిరిగి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు డిస్ట్రిక్ట్ చైర్మన్లు సోతుకు సుదర్శన్ రావు, పోలు శ్రీనివాస్ తెలిపారు కంటి వైద్య శిబిరానికి అవసరమైన బెంచీలు, తాగునీటి వసతి కల్పించిన మాంటీసోరీ హైస్కూల్ యాజమాన్యానికి లయన్స్ క్లబ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు..