మంగళవారం బాన్సువాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనసూయ సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బాన్సువాడ గ్రామీణ మండలం కొయ్యగుట్ట తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేదరి లక్ష్మీనారాయణ, షేక్ అహ్మద్, సాజిద్, కందూస్ తదితరులు మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు.