prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 7:59 am Digital Edition : PRAJA VANI

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 28(ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి – శ్రీనివాస్ బుధవారం హైదరాబాద్‌లో మంత్రి ని ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ జనగామ పట్టణ అభివృద్ధి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆ నిధులతో జనగామ పట్టణంలో పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

అలాగే జనగామ పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు, రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యం మెరుగుదల వంటి పనుల కోసం అదనపు నిధులు మంజూరు చేయాలని మంత్రి ని కోరినట్లు తెలిపారు.

దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి, జనగామ పట్టణ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చినట్లు చైర్పర్సన్ తెలిపారు. త్వరలోనే అదనపు నిధులు మంజూరు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారన్నారు.

మంత్రి ఆశీస్సులతో జనగామను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చైర్పర్సన్ పేర్కొన్నారు.