మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన సంస్కృతి టౌన్‌షిప్ ఇందిర ప్రియదర్శిని…..సంస్కృతి టౌన్‌షిప్‌ను గేటెడ్ కమ్యూనిటీగా మార్చేందుకు వినతి

ఘట్‌కేసర్, అక్టోబర్ 14 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్‌లో ఉన్న సంస్కృతి టౌన్‌షిప్‌ను గేటెడ్ కమ్యూనిటీగా మార్చేందుకు అవసరమైన అనుమతి పత్రాలను త్వరగా మంజూరు చేయాలని కోరుతూ ఇందిర ప్రియదర్శిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. సంస్కృతి టౌన్‌షిప్‌ను గేటెడ్ కమ్యూనిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కొన్ని అనుమతి పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆమె మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లో ఉన్న అనుమతుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, టౌన్‌షిప్‌ను గేటెడ్ కమ్యూనిటీగా మార్చేందుకు సహకరించాలని ఆమె...