మంత్రి నారా లోకేష్‌ను కలిసిన టీడీపీ యువ నాయకుడు చంద్రగిరి ప్రహల్లాద రెడ్డి: ఎగువ రామాపురానికి వెటర్నరీ ఆసుపత్రి మంజూరు చేయాలని వినతి

మంగళగిరి: అక్టోబర్ 07 ప్రజావాణి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, చంద్రగిరి నియోజకవర్గ పరిధికి చెందిన చంద్రగిరి ప్రహల్లాద రెడ్డి ఈరోజు సచివాలయంలో (జీఐడీ) రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ప్రత్యేక భేటీలో పలు ప్రాంతీయ సమస్యలతో పాటు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాసం, పశువైద్య సేవలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ప్రహల్లాద రెడ్డి గారు కడప జిల్లా కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామంలో...