prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 7:53 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన టీడీపీ యువ నాయకుడు చంద్రగిరి ప్రహల్లాద రెడ్డి: ఎగువ రామాపురానికి వెటర్నరీ ఆసుపత్రి మంజూరు చేయాలని వినతి

మంగళగిరి: అక్టోబర్ 07 ప్రజావాణి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, చంద్రగిరి నియోజకవర్గ పరిధికి చెందిన చంద్రగిరి ప్రహల్లాద రెడ్డి ఈరోజు సచివాలయంలో (జీఐడీ) రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ప్రత్యేక భేటీలో పలు ప్రాంతీయ సమస్యలతో పాటు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాసం, పశువైద్య సేవలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ప్రహల్లాద రెడ్డి గారు కడప జిల్లా కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామంలో ఒక వెటర్నరీ హాస్పిటల్ (పశువైద్య శాల) ను మంజూరు చేయాలని కోరుతూ మంత్రి నారా లోకేష్ గారికి ఒక అధికారిక లేఖ ద్వారా వినతిపత్రం అందజేశారు.గ్రామంలో పశువుల సంఖ్య ఎక్కువగా ఉందని, తగిన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో స్థానిక రైతులు, పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రహల్లాద రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో వెటర్నరీ ఆసుపత్రి గనుక అందుబాటులోకి వస్తే చుట్టుపక్కల ఉన్న మరికొన్ని పల్లెటూళ్ల రైతులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని ఆయన వివరించారు.రైతుల సమస్యల పట్ల, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండే మంత్రి నారా లోకేష్ ఈ వినతిపై అత్యంత సానుకూలంగా స్పందించారు. రైతాంగానికి, పశుపోషకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేస్తూ.ఎగువ రామాపురంలో వెటర్నరీ ఆసుపత్రి ఏర్పాటు విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రహల్లాద రెడ్డికి హామీ ఇచ్చారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సానుకూల హామీ లభించడం పట్ల చంద్రగిరి ప్రహల్లాద రెడ్డి మరియు స్థానిక గ్రామ ప్రజలు మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.