prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 10:15 am Digital Edition : PRAJA VANI

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి

*మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి*

జనగామ జిల్లా ప్రతినిధి (జె. ఉపేందర్), అక్టోబర్ 03 (ప్రజావాణి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని గిరిజన, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమం, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రి తో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు.

ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలోని గిరిజన తండాలు, గూడేలలో మౌలిక వసతుల కల్పన, గురుకుల పాఠశాలల అభివృద్ధి, హాస్టళ్లలో సౌకర్యాల మెరుగుదల, అలాగే వికలాంగులు, వయోవృద్ధులకు పెన్షన్లు, సంక్షేమ పథకాలు వేగంగా అందేలా చూడాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంత్రి కి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ఈ మర్యాదపూర్వక భేటీ చాలా స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, నియోజకవర్గ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు సాగాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి అందించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.