మండల ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్ కొల్లూరి సతీష్
దండేపల్లి, అక్టోబర్ 10 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల అధ్యక్షుడు, ఫీల్డ్ అసిస్టెంట్ కొల్లూరి సతీష్ మండలంలోని ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ద్వారక, కొండాపూర్ గ్రామాల ఆడపడుచులకు ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలను నింపాలని, ఆడపడుచులందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ బతుకమ్మ పండుగను ఐకమత్యంతో జరుపుకోవాలని కొల్లూరి సతీష్ పేర్కొనరు